PACHA BOTTESINA............... TELUGU SONG LYRICS.................
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంట రోడా నీతో
కొంటె తంటాలని తెచ్చుకుంటానురా
వేయి జన్మాల ఆరాటమై - వేచి ఉన్నానె నీ ముందరా
చేయి నీ చేతిలో చేరగా - రెక్క విప్పింది నా తొందర ॥ పచ్చ॥
మాయగా నీ సోయ గాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హల
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేల
హత్తుకుపో నను ఊపిరి ఆగేల
బాహుబందాల పొత్తిళ్ళలో - విచ్చుకున్నావే ఓ మల్లికా
కోడె కౌగిళ్ళ ఒత్తిళ్లలో - పురివిప్పింది నా కోరిక ॥ పచ్చ ॥
కానలో నువునేను ఒకమేను కాగా
కొనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవసమే
సాంతము నేన్ని సొంతము అయ్యాక
చెమ్మ చేరిటి చెక్కిళ్ళలో - చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలిమంచులా ॥పచ్చ॥

Comments
Post a Comment